హైదరాబాద్ : చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియాన్ని, ఫీల్ ద జైలు కేంద్రాన్ని యూత్ పర్ యాంటీ కరప్షన్ బృందం బుధవారం సందర్శించింది. బ్రిటిష్, నిజాం కాలం నాటి నుంచి ఉన్న జైలు నమూనాలను, అప్పటి శిక్షలను అందరికి అర్థమయ్యే రీతిలో పొందబరిచారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. ఒక రోజు జైలు జీవితం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిమాణమని, జైలులో ఖైదీల ప్రవర్తన, పనితీరు, శిక్షలు, ఆహారం ఎలా ఉంటుందనే అంశాలు పూర్తిగా తెలుస్తాయన్నారు.
దీని గురించి తెలుసుకున్న వారికి తప్పు చేయాలనే ఆలోచన రాదన్నారు. చంచల్‌గూడ జైలు సూపరిండెంటెంట్ యువతకు, విద్యార్థులకు దీనిపై మీ సంస్థ నుంచి అవగాహన కల్పించాలని కోరారు. శిక్షలు పడకుండా, నేరం చేయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొన్నె దేవేందర్, జి హరిప్రకాశ్, బత్తిని రాజేశ్, కొమటి రమేష్‌బాబు, సాయి కిరణ్, విక్రమ్, రాజ్ ఆహ్మత్ తదితరులు పాల్గొన్నారు.