పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంఖాల్‌లో నివాసముంటున్నసంజన (15) విద్యార్థిని. 27న ఉదయం తన తల్లితో పాటు మంచాన్పల్లిలోని చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. రాత్రి భోజనం చేసి నిద్రించారు.
28న ఉదయం తల్లి నిద్రలేచి చూడగా కూతురు కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలు చోట్ల ఆమె కోసం వెతికినా ఆచూకి లభించలేదు. మంగళవారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.