చాంద్రాయణగుట్ట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పుగూడ అంబికానగర్కు చెందిన చాకలి కవిత (34), ఈ నెల 26 న ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లింది.
సాయంత్రమైన ఆమె ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.