అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్‌కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు షేర్ హోల్డర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. స్కైలైన్ వెంచర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ బొంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టెడ్ అయ్యింది. కంపెనీకి 1100 మంది షేర్స్ హోల్డర్స్ ఉన్నారు. కంపెనీ డైరెక్టర్‌గా ప్రశాంత్ మిట్ట, ఆయన భార్య ఆషా మిట్ట తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు.
-సిటీబ్యూరో
ప్రశాంత్ మిట్ట, ఆయన భార్య ఆషా మిట్ట మిగతా డైరెక్టర్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితులు ఆరోపించారు. కంపెనీ డైరెక్టర్లుగా వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని, డైరెక్టర్లుగా ఏ మాత్రం ఆ పదవుల్లో కొనసాగడానికి వీలు లేదని మెజార్టీ షేర్ హోల్డర్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని బీఎస్ఈకి సమాచారం ఇచ్చారు. దీంతో ప్రశాంత్ మిట్టతో పాటు మిగతా డైరెక్టర్లు ఆ పదవుల్లో కొనసాగడానికి అర్హత కోల్పోయారు. కాగా, హైటెక్ సిటీని హెచ్డీఎఫ్సీ శాఖలో ఉన్న కంపెనీ అకౌంట్స్ నుంచి డైరెక్టర్‌గా అర్హత కోల్పోయిన తరువాత బ్యాంకు అధికారులతో కలిసి భారీగా లావాదేవీలు జరిపి, కంపెనీకి సంబంధించిన సొత్తును తన సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ప్రశాంత్ మిట్ట తనకు తెలిసిన వెర్కోటిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి కంపెనీకి వర్క్ అర్డర్ వచ్చిందని, దీనిని గ్యారెంటీగా చూపిస్తూ రాజ్ బ్రిడర్స్ అండ్ హ్యారీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 1.75 కోట్లు అప్పుగా తీసుకున్నారు.
ఈ రెండు సంస్థలు కూడా మాజీ డైరెక్టర్ ప్రశాంత్ మిట్టకు సంబంధించిన వారివేనని షేర్ హోల్డర్స్ గుర్తించారు. ఈ డబ్బును వివిధ ఖాతాలకు మళ్లించి చివరకు తమ సొంత ఖాతాలలోకి నిధులు మళ్లించుకున్నారు. రుణం ఇచ్చిన కంపెనీ, తాను ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించాలని కోరాలి. కానీ కంపెనీ చట్టాలలో ఉన్న కొన్ని అంశాలను అడ్డుపెట్టుకొని ఏకంగా కోట్ల విలువైన కంపెనీని తక్కువ మొత్తానికి కొట్టేయాలని కుట్ర చేశారు. రుణం తిరిగి ఇవ్వాలని అడుగకుండా, రూ.1.75 కోట్లు అప్పు ఇచ్చిన సంస్థ ద్వారా ఏకంగా 7 వారాలలోనే దివాళా ప్రక్రియను కూడా ప్రారంభించి, కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకు కొట్టేయాలని కుట్ర చేశారని షేర్ హోల్డర్స్ ఆరోపించారు.
అనధికారికంగా డైరెక్టర్లు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, కుట్ర పూరితంగా వ్యవమారించి రూ.10 కోట్లకు పైగానే కుంభకోణానికి పాల్పడ్డారంటూ షేర్ హోల్డర్స్ ఆరోపించారు. ఈ కుట్రలను గుర్తించిన షేర్ హోల్డర్స్ మరోసారి ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించుకొని కొత్తగా ముగ్గురు డైరెక్టర్లను నియమించుకున్నారు. ఈ డైరెక్టర్లు జరుగుతున్న కుంభకోణం గురించి ఆరా తీయడంతో ఏకంగా కంపెనీని దివాళ జాబితాలో పెట్టి, తక్కువ ధరకు తిరిగి తమకు అనుకూలమైన సంస్థ ద్వారా కొట్టేయాలనే భారీ కుట్రకు తెరలేపినట్లు గుర్తించారు. ఇలా చేయడం వల్ల 1100 మంది షేర్ హోల్డర్స్‌కు ఎలాంటి డబ్బు రాకుండానే సంస్థను దొడ్దిదారిన కైవసం చేసుకోవాలనే ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డైరెక్టర్ వెంకట సత్య సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రశాంత్ మిట్ట, ఆషా మిట్ట, కిశోర్ కుమార్, గౌరవ్ కురానపై కేసు నమోదు చేశారు.