హైదరాబాద్ : వారంతా చిన్నా, చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే బడుగుజీవులు. రెక్కాడితే డొక్కాడని వీధి వ్యాపారులపై(Street vendors) ట్రాఫిక్ పోలీసులు(Traffic police) దాష్టీకం ప్రదర్శించారు. ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద వందల సంఖ్యలో పుట్ పాత్ వెండర్స్ సామగ్రిని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. వారు ఏసుకున్న టెంట్లను తొలగించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ సామగ్రిని తీసుకువెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. కుమారి ఆంటీకో న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలను చేసుకుంటున్న తమలాంటి వారిపై పోలీసుల దాడులు ఆపాలని బాధితులు కోరుకుంటున్నారు.
పుట్ పాత్ వెండర్స్ పై ట్రాఫిక్ పోలీసుల దాష్టీకం
హైదరాబాద్ ITC కోహినూర్ హోటల్ వద్ద వందల సంఖ్యలో పుట్ పాత్ వెండర్స్ సామాగ్రిని సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ సామాగ్రిని తీసుకువెళ్ళారని ఆరోపిస్తున్న భాదితులు.
కుమారి ఆంటీకో న్యాయం మాకో న్యాయా అంటున్న… pic.twitter.com/Nl2WMn8jV7
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024