Gandipet Gates | ఎగువ నుంచి పెరుగుతున్న నీటి ఉధృతి.. గండిపేట చెరువు రెండు గేట్లు ఎత్తివేత
Gandipet Gates | ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రాత్మక గండిపేట జలాశయం నిండుకుండలా మారింది.
మణికొండ ( హైదరాబాద్ ) : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రాత్మక గండిపేట జలాశయం నిండుకుండలా మారింది. జలాశయ గరిష్ట నీటి మట్టం 1790 అడుగులు ఉండగా ప్రస్తుతం 1787.15కు నీటిమట్టం పెరగడంతో బుధవారం జలమండలి అధికారులు, స్థానిక ఎమ్మెల్యేప్రకాష్గౌడ్ చేతుల మీదుగా రెండు గేట్లను ఎత్తివేశారు.
వికారాబాద్, శంకర్పల్లి, జన్వాడ గ్రామాల మీదుగా నీటి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో జలాశయం నిండేందుకు మూడు అడుగులు ఉండగానే ముందస్తు చర్యలలో భాగంగా రెండు గేట్లను ఎత్తి 216 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలినట్లు డీజీయం నరహరి తెలిపారు. గేట్లు ఎత్తి ముందు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి బుధవారం మధ్యాహ్నం రెండు గేట్లను ఎత్తారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఆర్డీవో మల్లయ్య, డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, జలమండలిశాఖ అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లను ఎత్తించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసి నిస్వార్థంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దికి వరణుడు కరుణించి దీవిస్తున్నాడని ఎమ్మెల్యే తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా సుబిక్షంగా వర్షాలు కురుస్తున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

