సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణకు కొత్త టెండర్లు పిలిచేందుకు స్టాండింగ్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు నగరంలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి ఈఈఎస్ఎల్ గ్రూప్‌ను తప్పించి… కొత్త ఏజెన్సీకి పనులు బల్దియా అప్పగించనున్నది. ఈఈఎస్ఎల్ నిర్వహణ లోపాలు, కొత్త ప్రతిపాదిత టెండర్ విధి విధానాలు, షరతులు, నిబంధనలపై బల్దియా అధికారులతో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, మేయర్ ఆర్వీ కర్ణన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చర్చించారు. ఆ ఏజెన్సీకి ఇచ్చిన గడువు ముగియడంతో… టెండర్ ప్రక్రియ చేపట్టేంత వరకు వీధి దీపాల నిర్వహణ, కొనుగోలు వ్యవహారాలను జోనల్ కమిషనర్ల స్థాయిలో చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.