తలసానికే మా ఓటు
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కే తాము ఓటు వేస్తామంటూ నియోజకవర్గం పరిధిలోని వివిధ సంఘాల ప్రతినిధులు తీర్మానాలు చేస్తున్నారు.
- ఏకగ్రీవ తీర్మానాలు చేసిన సిఖ్ కమిటీ, వయోధికుల సంఘాలు
- ఇదే బాటలో మరిన్ని కాలనీలు, యువజన, మహిళా, బస్తీ సంఘాలు
అమీర్‌పేట్, అక్టోబర్ 12 : మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కే తాము ఓటు వేస్తామంటూ నియోజకవర్గం పరిధిలోని వివిధ సంఘాల ప్రతినిధులు తీర్మానాలు చేస్తున్నారు. బుధవారం రాత్రి అమీర్‌పేట్ సిఖ్ ప్రతినిధులు, ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రతినిధులు తమ తమ ప్రాంగణాల్లో జరిగిన ప్రతినిధుల సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇదే బాటలో నియోజకవర్గం పరిధిలోని మరిన్ని కాలనీలు, యువజన, మహిళా, బస్తీ సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తున్నది.
బుధవారం అమీర్‌పేట్ గురుద్వారా సమీపంలోని మన్మీత్ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ట్రస్టు అధ్యక్షుడు సరాందర్ కుల్వంత్‌సింగ్ (టిల్లు భాయ్) ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి తలసానికి మద్దతు తెలుపుతూ చేసిన తీర్మానంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక సిఖ్ కమిటీ ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గురువారం ఉదయం సిఖ్ కమిటీ ప్రతినిధులంతా మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలిసి తమ తీర్మాన ప్రతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, మండలి సలహాదారు కాసాని సహదేవ్‌గౌడ్, ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి అధ్యక్షుడు మాణిక్‌రావు పాటిల్, పెరుమాండ్ల లింగమయ్య సహా ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

