Asha workers services | ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్‌పేట: కొవిడ్ సమయంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మహిళా బంధులో భాగంగా సోమవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ యూపీహెచ్సీ ఆవరణలో ఆశా వర్కర్లు, మహిళా సిబ్బందికి ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు గత రెండేళ్లుగా కొవిడ్ సమయంలో చాలా బ్రహ్మాండంగా పని చేశారన్నారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో మూడు రోజుల పాటు మహిళా బంధు కేసీఆర్ పేరిట మహిళా దినోత్సవ సంబురాలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు.
అనంతరం పలువురు ఆశావర్కర్లు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు కేసీఆర్ జీతాలను పెంచి జీవితాల్లో వెలుగులు నింపారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కాలేరు దీప్తిపటేల్, వైద్య సిబ్బంది దేవకి, మాధురి, మన్యాల, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, ఎస్.సులోచన, శ్రీరాములుముదిరాజ్, దిలీప్, శివాజీయాదవ్, నర్సింగ్, మహేష్, స్వర్ణ, అరుణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

