వ్యాపారంలో మహిళల పాత్ర కీలకం
కంపెనీల్లో బోర్డు పాత్ర పాలించడమే తప్ప ఆదేశాలివ్వడం కాదని, కంపెనీ పాలనా వ్యవహారాల్లో మహిళలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.రామకృష్ణన్ అన్నారు.
- ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.రామకృష్ణన్
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): కంపెనీల్లో బోర్డు పాత్ర పాలించడమే తప్ప ఆదేశాలివ్వడం కాదని, కంపెనీ పాలనా వ్యవహారాల్లో మహిళలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.రామకృష్ణన్ అన్నారు. గురువారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టీ హబ్‌లో ఫ్యామిలీ బోర్డులలో మహిళల పాత్రపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వి.రామకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… కుటుంబం నిర్వహించే వ్యాపారాల్లో మహిళలు సైతం కీలక స్థానంలో ఉండి కంపెనీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం కొంత మేరకే ఉన్నా..
మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యంగా ఒక కంపెనీ నిర్వహణలో జవాబుదారీతనం, చిత్తశుద్ధి, సమర్థత చాలా ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. కుటుంబ పరిధిలో ఉండే కంపెనీలు చాలా ఉన్నాయని, వ్యాపారాల నిర్వహణలో నిర్ణయం తీసుకోవడంలో కుటుంబ సభ్యులు మూల స్తంభాలుగా ఉన్నారని, ఇందులో మహిళలు సైతం ఉన్నారని, దీని వల్ల పురోగతి, సమానత్వం, మెరుగైన పాలన దిశగా ఒక అడుగు ముందుకు పడుతుందన్నారు. ఈ సమావేశంలో పాల్కివాలా ఫౌండేషన్ ట్రస్టీ కస్తూరి బాలాజీ, ఎఫ్ఎల్ఓ నేషనల్ ప్రెసిడెంట్ సుధా శివకుమార్, చైర్ పర్సన్ రితూ షాలతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

