చంపాపేట, సెప్టెంబర్24: సమాజాభివృద్ధిలో గురువుల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కర్మన్‌ఘాట్ ఎస్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దయానంద్ హాజరై మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అవసరమైన మేధా సంపత్తిని కేవలం గురువులు మాత్రమే అందించగలరని తెలిపారు.
వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. తమ వేదిక ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వైశ్య విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అక్టోబర్ 1న వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే వైశ్య గర్జనకు సంబంధించిన పాటల సీడీని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దయానంద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వర్ రావు, తెలంగాణ వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అడిషనల్ ఎస్పీ పోలా విజయ్‌కుమార్, ఏసీపీలు, జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ, వైశ్య వికాస వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.