ఖైరతాబాద్, ఏప్రిల్ 2 : రాష్ట్రంలోనే ఆ ఠాణా ఓ ప్రత్యేకం.. అయినా రెండేళ్లుగా ఈ పీఎస్‌కు వచ్చే అధికారుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఒకప్పటి అత్యుత్తమ ఠాణా పేరుకు మకిలీ అంటిస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉన్న ఈ స్టేషన్లో తాజాగా జరుగుతున్న ఘటనలు పోలీస్‌స్టేషన్ ఖ్యాతిని మరింత దిగజారుస్తున్నాయి. ఫిర్యాదుదారుడు ఈ స్టేషన్‌కు వస్తే చాలు.. అయితే సెటిల్మెంటు.. లేకపోతే కేసు.. ఏదో ఒక రకం గా ఇరువర్గాలతో మాట్లాడడం, అవసరమైతే పీఎస్ పక్కనే కార్యాలయం ఏర్పా టు చేసుకొన్న ఓ మధ్యవర్తి ద్వారా ప్రతిరోజు ఈ అధికారి లావాదేవీలను కొనసాగిస్తూ వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నారు.
ఇదంతా ముఖ్య అధికారి వరకు తెలిసినా వారు మాత్రం ఈ అధికారి విషయంలో పట్టింపు లేకుండా ఉన్నారు. తనకు గాడ్‌ఫాదర్‌లాంటి ముఖ్యమైన వ్యక్తి ఉండగా తనకేం భయం అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చే స్తూ తన పరిధిలోఉన్న అక్రమ వ్యాపారాలన్నింటిని అనధికారికంగా నడిపించేలా చేస్తున్నారని పోలీస్‌స్టేషన్‌లోనే చెప్పుకుంటున్నారు. ఈ వారం రోజుల్లో ఓ స్పాసెంటర్లో జరిగిన వ్యవహారం తన దృష్టికి రావడంతో వారిపై రైడ్ చేసి పట్టుకుని బయట పడకుండా రెండుమూడు రో జులు దాచిపెట్టి ఆ తర్వాత కొందరి ఒత్తిడితో నామమాత్రంగా బయటపెట్టారు. ఈ వ్యవహారంలో స్పా సెంటర్ యజమాని నుంచి పెద్ద ఎత్తున నజరానా ముట్టినట్లు, అందుకే నామమాత్రపు కేసులతో వారికి వత్తాసు పలుకుతున్నారని, అసలు వ్యక్తులను వదిలేసినట్లుగా ఠా ణాలో ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఆర్థిక పరం గా పెట్టుబడులు పెట్టించుకుని మోసం చేసిన వారిపై తమ స్టేషన్‌కు ఫిర్యాదు రాగానే అవి తమకు డబ్బులు సంపాదించే ఆదాయవనరులా చూస్తారు. వెంటనే మోసం చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి లక్షల్లో డబ్బులు దండుకుని ఈ కేసులు తమ పరిధిలోకి రావంటూ వేరే దగ్గరకి వెళ్లాలంటూ ఫిర్యాదుదారులకు సూచించడం, లేదా వేరే ఏదైనా కారణాలతో వారిని స్టేషన్ చుట్టూ తిప్పడం సాధారణమైంది. ఇలా.. ఒకట్రెండు కేసు లు కాదు.. ఇక్కడకు వచ్చే దాదాపు ఫిర్యాదుల్లో ఎక్కువశాతం కేసులుగా నమోదైనా అవి ఆలస్యంగా జరగడం, మరికొన్నింటికి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయకపోవడం, ఇంకొన్ని కేసుల్లో తమ సెటిల్మెంట్ పూర్తయ్యే వరకు ఆగి తాము అనుకున్న పని జరిగితే కేసు నీరుగార్చడం, ఒకవేళ అనుకున్నంత రాకపోతే కేసులను కట్టడం జరుగుతోంది. ఈ ఠాణా వ్యవహారంపై కమిషనరేట్ ముఖ్య అధికారి వరకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఠాణా పరిధిలో ఇటీవల ఓ హుక్కాసెంటర్ను సీజ్ చేసినప్పటికీ తిరిగి వారంలోపే తెరుచుకోవడం ఇలా తమ సెంటర్‌ను తిరిగి తెరిచేందుకు అనధికారికంగా అనుమతి ఇచ్చిన ఆ ఆఫీసర్‌కు లక్షల్లో ముడుపులు ముట్టాయని, ఇదంతా ఆ మధ్యవర్తి కారణంగానే జరిగిందని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. స్టేషన్లో కేసు ల వ్యవహారాలన్నీ అధికారులు కా కుం డా ఆ మధ్యవర్తే నిర్ణయిస్తాడని అం టున్నారు. తన కేసులను చక్కబెట్టుకోవడం తో పాటు అధికారులకు దగ్గరుండి మూ టలు ఇప్పిస్తాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.