బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతోంది. భోగారం, రాంపల్లిదాయర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల శ్రేణులు ఆదివారం మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి బోడుప్పల్ చెంగిచర్ల యాదవ సంఘం ప్రతినిధులు ఆదివారం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్ బింగి జంగయ్యయాదవ్, సోమేశ్యాదవ్, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
-బోడుప్పల్, అక్టోబర్ 22
మేడ్చల్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ)/కీసర: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసం వద్ద ఆదివారం మేడ్చల్ నియోజక వర్గంలోని భోగారం, రాంపల్లి దాయర గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తొమ్మిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తప్ప కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మె పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ పార్టీల అడ్రస్ గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తున్నదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు బాగా పెరుగుతున్నాయన్నారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు తెలుపలన్నారు. కాంగ్రెస్, బీజేపీలో చేరికలు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రమోద్, రాము, శ్రీనివాస్, కిట్టు, మహేశ్, భాను, నర్సింహ శ్రీనివాస్, ప్రవీణ్, శేఖర్ తదితరులతో పాటు 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువా వేసి ఆహ్వానించారు.