సిటీబ్యూరో : ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం నుంచి తొలిసారి డా. సనుజిత్. ఎ. పావుడే గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకున్నారు. శుక్రవారం ఉస్మానియా మెడికల్ కాలేజ్ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి చెందిన డా.సనుజిత్.ఎ.పావుడెకి గోల్డ్‌మెడల్‌ను ప్రదానం చేశారు.
ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన డా. సనుజిత్కు, న్యూరో విభాగం నుంచి డాక్టర్ మేఘన చిగురుపాటికి గోల్డ్‌మెడల్స్‌ను అందజేసినట్లు డాక్టర్ లక్ష్మీ పలుకూరి వెల్లడించారు.