మావోయిస్టుల హత్యాకాండను ఆపాలి
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక సంపాదకుడు నవీన్, మరో 25 మంది మవోయిస్టులను ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో దారుణంగా చంపడం దుర్మార్గమని, ఇవి ముమ్మాటికి రాజకీయ హత్యలేనని ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్ షావలి స్పష్టం చేశారు.
- వారితో వెంటనే శాంతిచరచలు జరపాలి
- ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్ షావలి
జవహర్‌నగర్, మే 22: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక సంపాదకుడు నవీన్, మరో 25 మంది మవోయిస్టులను ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో దారుణంగా చంపడం దుర్మార్గమని, ఇవి ముమ్మాటికి రాజకీయ హత్యలేనని ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్ షావలి స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మవోయిస్టులను హత్య చేయడం దారుణమని, ఆయా హత్యలపై సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం షేక్ షావలి ఒక ప్రకటన విడుదల చేశారు.
నంబాల కేశవరావు మృతిపై దేశ ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. మావోయిస్టులపై సాధించిన అతిపెద్ద విజయంగా కీర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, మధ్య భారతదేశంలో గత 16నెలలుగా వందలాది ఆదివాసీయులను పొట్టన పెట్టుకున్న వారికి పెద్ద తేడా ఏముందో చెప్పాలని ప్రశ్నించారు.
ఆదివాసీల హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న మవోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని పలుమార్లు ప్రకటించినప్పటికీ, ఆపరేషన్ కగార్ పేరుతో హత్యకాండకు మొగ్గుచూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయమై దేశంలోని మేధావులు, కవులు, రాజకీయ పార్టీలు వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. అడవిలోని జీవరాశులను, పర్యావరణాన్ని దెబ్బతీసే కుట్రపూరితమైన చర్యలను ప్రతి పౌరుడు సంఘటితంగా ఎదుర్కోవాలని షావలి పిలుపునిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

