మాదాపూర్, మార్చి 28 : వాకింగ్ చేస్తు ఓ వ్యక్తి అకస్మా్త్తుగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సుఖేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న బత్తిని ఉదయ భాస్కర్ అలియాస్ దుర్గా ప్రసాద్ (42) వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
కొండాపూర్ రాఘవేంద్ర కాలనీకి చెందిన హైటెన్షన్ మార్గంలో వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతన్ని దగ్గరలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తరలించగా పరీక్షలు జరిపిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అతడి భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.