హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 7 : నగర తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు తనవంతు కృషి చేస్తానని మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ తెలిపారు. హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గురువారం కృష్ణస్వామి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన రాష్ట్ర మత్య్స,సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ పిట్టల రవీందర్‌తో కలిసి హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది పలికిన కృష్ణస్వామి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల వెంకటనరసయ్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంజిత్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ బొక్కా శ్రీనివాస్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాధిక,ప్రధాన కార్యదర్శి శారద, నాయకులు కృపాసాగర్,చంద్రమౌళి, శీలం సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్‌లో..
మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 7 : సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ చౌరస్తాలో నగర తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 130వ జయంతిని కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మల్కాజ్గిరి పార్లమెంట్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఎంపీ ఆర్. కృష్ణయ్య, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరై కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సేవా సమితి సభ్యులు అశోక్ ముదిరాజ్, యాదగిరి, జగన్, శ్రీనివాస్, రామరావు, సురేష్, వీరమణి, వేణుగోపాల్, బోర్డు మాజీ సభ్యుడు నళిని కిరణ్, పాండుయాదవ్, బీఆర్ఎస్ నాయకులు ముప్పిడి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.