సాగర తీరంలో సరికొత్త మణిహారం
చల్లని సాయంత్రాన.. సాగర తీరంలో చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో నీరు.. నీటి ఉపరితలంపై నుంచి 15 మీటర్ల ఎత్తులో నడుచుకుంటూ వెళితే.. ఆ దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.
- హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లేక్ ఫ్రంట్ పార్కు సిద్ధం
- రూ.26.65 కోట్ల వ్యయం… 10 ఎకరాల్లో నిర్మాణం
చల్లని సాయంత్రాన.. సాగర తీరంలో చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో నీరు.. నీటి ఉపరితలంపై నుంచి 15 మీటర్ల ఎత్తులో నడుచుకుంటూ వెళితే.. ఆ దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.నగరవాసులకు ఇలాంటి అనుభూతిని పంచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా లేక్ ఫ్రంట్ పార్కును సిద్ధం చేస్తోంది. సుమారు రూ.26 కోట్లతో 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పార్కును మంత్రి కేటీ రామారావు త్వరలోనే ప్రారంభించనున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) :పచ్చని చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ నీటి పైకి ఎంచక్కా వెళ్లిపోవచ్చు. నీటి ఉపరితలం నుంచి 15 మీటర్ల ఎత్తులో చూస్తే అది ఒక అద్భుత దృశ్య కావ్యం అవుతుంది. అలాంటి నిజమైన అనుభూతిని పొందేందుకు హుస్సేన్‌సాగర్ తీరం వేదికగా మారనున్నది. నగర వాసులకే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు టూరిస్టు ప్రాంతంగా పేరుగాంచిన హుస్సేన్‌సాగర్ ఇప్పుడు సరికొత్త హంగులతో కట్టుకోనున్నది.
హెచ్ఎండీఏ చేపట్టిన లేక్ ఫ్రంట్ పార్కును త్వరలోనే మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మహానగరంలో ఎన్నో పార్కులు ఉన్నా, వాటికి పూర్తి భిన్నంగా.. అత్యాధునిక డిజైన్లు, సరికొత్త అనుభూతిని పొందేలా సాగర తీరంలో లేక్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేశారు. సుమారు 10 ఎకరాల్లో రూ.26 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మించారు. నీటి పైకి వెళ్లేలా రెండు చోట్ల ఏర్పాటు చేసిన బోర్డు వాక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

లేక్ ఫ్రంట్ పార్కు ఫీచర్లు..
- సుమారు 10ఎకరాల్లో చేపట్టిన పార్కులో 25 ఏళ్ల వయస్సు ఉన్న 22 చెట్లను ట్రాన్స్‌ప్లాంటెడ్ ద్వారా నాటారు. అవి పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పార్కులో 40 రకాల చెట్లను నాటారు. వీటితో పాటు దోమల నివారణ చెట్లతో పాటు సుగంధ ద్రవ్యాలను వెదజల్లే చెట్లు ఉన్నాయి.
- ల్యాండ్‌స్కేపింగ్ (పచ్చదనం) కోసం సుమారు 4లక్షల మొక్కలను ఆకర్షణీయమైన డిజైన్లతో నాటారు. వీటి కోసం మొట్ట మొదటిసారిగా పేర్లతో పాటు బార్‌కోడింగ్‌ను ఏర్పాటు చేశారు.
- పరిపాలన భవనంతో పాటు టికెట్ కౌంటర్ బ్లాక్, భద్రతా గదులు, మూత్రశాలలు, ఇతర మౌలిక వసతులను కల్పించారు.
- విద్యుత్‌తో వెలిగే బొల్లార్స్, డెకరేటివ్ ఎల్ఈడీ లైటింగ్, హైమాస్ట్ లైటింగ్, నవీ కాలమ్ లైటింగ్, నియో ఫ్లెక్సీ లైటింగ్‌లను పార్కులోని బోర్డు వాక్‌ల వెంబడి ఏర్పాటు చేశారు.
- లేక్ ఫ్రంట్ పార్కులో నిర్మించిన బోర్డు వాక్ డెక్ నీటికి 15 మీటర్ల ఎత్తులో క్యాంటీ లీవర్, పర్గోలాస్ల సాయంతో నీటిలోకి వెళ్లినట్లు ఉంటుంది.
- లేక్ ఫ్రంట్ పార్కులో ఎన్నో ఆకర్షణీయమైన నిర్మాణాలు ఉన్నాయి. పంచతంత్ర వాక్ వే, సెంట్రల్ పాత్ వే, అండర్‌పాస్‌లు, పెవిలియన్స్, ప్రొమెనేడ్ ఏరియాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
- పార్కులో ఎంతో హైలెట్‌గా నిలిచేవి ఎలివేటెడ్ వాక్‌వేలు (ఆకాశమార్గాలు). ఇందులో మొత్తం 4 ఆకాశ మార్గాలను నిర్మించగా, వీటి పొడవు 110మీటర్లు, క్యాంటీలీవర్ జెట్టి పొడవు 15 మీటర్లు ఉంటుంది. నీటి మీదకు చొచ్చుకు వెళ్లేలా ఉండే వ్యూ పాయింట్ ఆకట్టుకునేలా ఉంటుంది. అదేవిధంగా 2 మీటర్ల వెడల్పుతో కూడిన క్యాంటీలీవర్ వాక్‌వే పొడవు 240 మీటర్లు, 2 మీటర్ల వెడల్పుతో కూడిన వాక్‌వే 690 మీటర్లతో ఉంటుంది.
- ప్రజల సందర్శన కోసం పార్కును ఉదయం 5:30 నుంచి 11.30 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
- పార్కులో ప్రవేశానికి రుసుం చిన్న పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.50 వసూలు చేస్తారు. మార్నింగ్ వాకర్స్ కోసం ప్రతి నెలా రూ.100 చార్జీ నిర్ణయించారు.
- లేక్ ఫ్రంట్ పార్కు అభివృద్ధి కోసం రూ.22 కోట్లు (సివిల్, ఎలక్ట్రికల్), ల్యాండ్ స్కేపింగ్ కోసం రూ.4.65 కోట్లు వెచ్చించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- hmda
- Hyderabad
- Lake Front Park
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

