హైదరాబాద్ : తన మాట వినలేదని ఓ హోటల్ యజమాని(Hotel owner) సమీప హోటలో పనిచేస్తున్న కార్మికుడిపై కత్తితో(knife) దాడికి(Attacked) పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో (Shadnagar) శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన ఆహ్మద్ హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఆశియాన హోటల్ పక్కన కొనసాగుతున్న మరో హోటల్లో కార్మికుడిగా ఉపాధి పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఆశియాన హోటల్ యజమాని సాబెల్ హోటల్‌ను ముసివేసే క్రమంలో తమ హోటల్ ముందు ఉన్న వస్తువులను లోపల పెట్టాలని ఆహ్మద్‌కు చెప్పాడు. అయితే ఆహ్మద్, సాబెర్ మాటలను పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన సాబెర్ ఆహ్మద్‌తో వాగ్వాదానికి దిగారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరిని విడిపించారు.
ఈ విషయాన్ని అహ్మద్ తన హోటల్ యజమానికి చెప్పేందుకు వెళ్తుండగా వెంబడించిన సాబెర్ తన వద్ద ఉన్న కూరగాయలు కోసే కత్తితో అహ్మద్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అహ్మద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం అహ్మద్‌ను హైదరాబాద్ లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.