కూకట్‌పల్లిలో కథానాయిక కాజల్ అగర్వాల్ సందడి చేసింది. ఈ సందర్భంగా కాజల్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
– మియాపూర్, డిసెంబరు 16
మియాపూర్ , డిసెంబరు 16 : కూకట్‌పల్లిలో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ సందడి చేసింది. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ బస్టాపు సమీపంలోని పీఎన్ఆర్ వ్యూస్ మాల్లో దేవీ పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం ప్రారంభోత్సవంలో కాజల్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజల్‌తో ఫొటోలు దిగేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు పోటీపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాజీ ఎంపీ వేణుగోపాల చారి, కార్పొరేటర్లు శ్రీనివాస్‌రావు, వెంకటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, దుకాణ నిర్వాహకులు పాల్గొన్నారు.