మారేడ్‌పల్లి : విద్యా రంగానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా ర్థులకు ఎమ్మెల్యే జి. సాయన్న స్కాలర్షిప్లను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ విద్యా రంగానికి లక్షల రూపాయాల నిధులు కేటాయించి, ప్రభుత్వ పాఠశాలను, కళాశాలను అభివృద్ధి పరుస్తుందని తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ వారు ముందుకు వచ్చి పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ , మలబార్ గోల్డ్, డైమండ్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.