
ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
వెంగళరావునగర్, డిసెంబర్11 : రైతే దేశానికి వెన్నెముక అని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని క్వీన్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇన్స్పైర్ ఇండియా ఫెస్ట్-2021 పేరుతో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు చిన్నారుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రదర్శనలో డ్రిప్ ఇరిగేషన్, జురాసిక్ వరల్డ్, సౌరకుటుంబం, నాగార్జున సాగర్ డ్యామ్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌తో పాటు రైతులు, వ్యవసాయ పద్ధతులు, పల్లెటూరు వాతావరణం తదితర నమూనాలను రూపొందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రామలింగం, విద్యార్థులు, తల్లిదండ్లులు పాల్గొన్నారు.