ఖైరతాబాద్/ హిమాయత్ నగర్ , మార్చి 26 : దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని, పాస్టర్ ప్రవీణ్ పగడాల, దళిత క్రైస్తవ న్యాయవాది ఇజ్రాయెల్ హత్యలపై పాలకులు కావాలనే కాలయాపన చేస్తున్నాయని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వాల వైఖరిని ఖండించారు.
పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుట్ర జేస్తుందన్నారు. ప్రవీణ్ ఇంటిపై ఎక్కడా ప్రమాద గాయాలు కాకుండా ఎవరో హింసించినట్లు గాయలు ఉన్నాయన్నారు. దళిత క్రైస్తవుడు న్యాయవాది ఇజ్రాయల్ హత్య బాధాకరమన్నారు. ఒక న్యాయవాది రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, క్రిస్టియన్ జేఏసి చైర్మన్ సాల్కోన్ రాజు, రిటైర్డ్ జడ్జి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరిపించాలి
ప్రముఖ క్రైస్తవ బోధకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అను మానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరి పిం చాలని పలు క్రిస్టియన్ సంఘాల నేతలు, పాస్టర్లు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధ వారం హైదర్ గూడలోని ఎన్ ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో క్రిస్టి యన్ సంఘాల నేతలు బిషప్ భాస్కర్, సుజీవన్, సుధీర్ కుమార్ మాట్లాడుతూ హిందూ సం ఘాల నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని వారం క్రితమే సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ ఒక పోస్టు పెట్టారని చెప్పారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ సంఘాల నేతలు అశోక్,దర్శన్,అభిషేక్, విలియం, రవికుమార్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.