సీఎం చిత్ర పటానికి పాలతో అభిషేకం…
మియాపూర్ : భారీ ఉద్యోగాల భర్తీ ప్రకటన ద్వారా నిరుద్యోగుల కలలను తమ సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా స్వపరిపాలనను సాధించిన ఆయన ఆ దిశగా విజయవంతంగా ముందడుగు వేస్తూ అన్ని వర్గాల ప్రజలను సంతోషపెడుతున్నారన్నారు.
అసెంబ్లీ వేదికగా వివిధ విభాగాల్లో 91 వేల పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ బుధవారం నాటి ప్రకటన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్టలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, పార్టీ నేతలతో కలిసి విప్ గాంధీ సీఎం చిత్ర పటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణా సంచా కాలుస్తూ సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ఇప్పటికే 1.25 లక్షల ఉద్యోగాలను భర్తి చేసిన సీఎం తాజాగా మరో 90 వేల ఉద్యోగాలకు ప్రకటన చేయటం అత్యంత సంతోషకరమని, ఈ ప్రకటనతో నిరుద్యోగులలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందని మరోసారి సీఎం కేసీఆర్ నిరూపించారని, మున్ముందు మరిన్ని అవకాశాలు వారి వద్దకు రానున్నాయన్నారు.
సాగు సహా ఇతర అన్ని రంగాలను పురోగతిలో ముందుకు నడిపిస్తూ యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తూ విజయవంతంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శమని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఉమ్మడి పాలనలో యువతకు జరిగిన అన్యాయాన్ని సహించలేకే ప్రజాశక్తితో పోరాడి వారికి అండగా నిలిచారని విప్ గాంధీ పేర్కొన్నారు.
నియోజకవర్గ నిరుద్యోగుల తరపున సీఎం కేసీఆర్‌కు విప్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజేందర్, సత్యనారాయణ, ఖదీర్, బాలయ్య, కుమారస్వామి, సుబ్బారావు, పరమేశ్వర్రావు, శ్రీనివాసరావు, రంగరాజు, వెంకటేశ్వర్రావు, మహిళా ప్రతినిధులు కృష్ణకుమారి, విమల, స్వప్న,పర్వీన్, మాధవి, లక్ష్మీ,,ఏలేంద్ర, శృతి,తదితరులు పాల్గొన్నారు.