ఫలిస్తున్న బీఆర్ఎస్ పోరాటం.. దిగొస్తున్న రెవెన్యూ యంత్రాంగం
బీఆర్ఎస్ పోరుబాటతో నిషేధిత జాబితా(22ఏ) నుంచి ప్రజల ఆస్తుల తొలగింపులో రెవెన్యూశాఖ నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 22ఏ బాధితులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి తమగోడును వెల్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు.
- నిషేధిత జాబితా నుంచి ఆస్తుల తొలగింపు
- బాధితులకు భరోసా ఇస్తున్న గులాబీ ప్రతినిధులు
మేడ్చల్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పోరుబాటతో నిషేధిత జాబితా(22ఏ) నుంచి ప్రజల ఆస్తుల తొలగింపులో రెవెన్యూశాఖ నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 22ఏ బాధితులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి తమగోడును వెల్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు బాధితులతో బాధితులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆందోళన చెందవద్దని మీ వేంట మేము ఉన్నమంటూ భరోసా కల్పించారు. హరీశ్‌రావుకు తోడు జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇస్తున్న భరోసా బాధితులకు కొండంత బలంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పోరుబాటతో కాంగ్రెస్ ప్రభుత్వంపై త్రీవంగా ఒత్తిడి పెరగడంతో.. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయానికి వివరాలను పంపుతున్నట్లు సమాచారం.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో జాప్యం..
బీఆర్ఎస్ ఒత్తిడి మేరకు నిషేదిత జాబితాను కొన్నింటిని తొలగించేందుకు రెవెన్యూశాఖ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాత్రం జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూశాఖ నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయగా.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలో ఆన్లైన్లో కనిపించాలంటే 3 రోజుల సమయం పడుతుందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులు చేబుతున్నారు. ఈక్రమంలో తమ ఆస్తులు నిషేధిత జాబితా నుంచి తొలగించారా లేదా అన్న అనుమానాలు బాధితులకు కలుగుతున్నాయి.
బీఆర్ఎస్ పోరుబాట కొనసాగిస్తుంది
ప్రజల ఆస్తులను పూర్తిగా నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీఆర్ఎస్ పోరుబాట కొనసాగిస్తుంది. ప్రజలు కష్టపడి సంపాందించుకున్న ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏంటి. బాధితులు ధైర్యం కొల్పోవద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్తుల తొలగించేవరకు ఊరుకునేది లేదు. బాధితులు నన్ను ఎప్పుడైనా కలువవచ్చు. వారి వివరాలు ఇస్తే జిల్లా కలెక్టరేట్ కార్యాలయనికి పంపించి నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటాం.
– కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్
ప్రజల ఆస్తులకు రక్షణగా నిలుస్తాం
జిల్లాలోని మెజార్టీ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన క్రమంలో ఆస్తుల క్రయ, విక్రయాలు జరుగక అత్యవసరం డబ్బులు అవసరం ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిషేదిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించేవరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. ప్రజలెవరూ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని వచ్చే బ్రోకర్లను నమ్మవద్దు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లీగల్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మల్కాజిగిరి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

