మణికొండ/ మైలార్‌దేవ్‌పల్లి/బండ్లగూడ/ శంషాబాద్ రూరల్/వ్యవసాయ యూనివర్సిటీమే 5 : ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లిలోని ఆయన నివాసానికి గండిపేట మండల పరిధిలోని నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదల పెన్నిధి ప్రకాశ్‌గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కోరారు.
మండల పరిధిలోని మణికొండ, నెక్నాంపూర్, నార్సింగి, కోకాపేట, గండిపేట, వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల నుంచి నాయకులు నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి,వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, కౌన్సిలర్లు అరుణజ్యోతి, శివారెడ్డి, పత్తి శ్రీకాంత్‌రావు, పత్తి ప్రవీణ్‌కుమార్, రామకృష్ణారెడ్డి, కావ్యశ్రీరాములు, శైలజ,వసంత్చౌహాన్, లావణ్యనరేశ్, మాజీ ఎంపీపీ మల్లేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, నార్సింగి మున్సిపాలిటీ అధ్యక్షుడు నర్సింహ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్‌యాదవ్, మణికొండ మున్సిపాలిటీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు బషీర్, పార్టీ సీనియర్ నాయకులు జంగయ్య, నీలేశ్ప్రసాద్ దూబే, లక్ష్మీశ్రీ, ప్రమోద్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ప్రభావతి, రూపారెడ్డి తరలివెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతోనే మూడు సార్లు ఎమ్మెల్యేను అయ్యానని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లిలోని తన నివాసంలో జన్మదిన వేడుకలను కార్యకర్తలు వైభవంగా నిర్వహించారు. కార్యకర్తలు భారీ గజమాలతో ఆయనకు సన్మానం చేశారు. తలసేమియా బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు .యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ..నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అంకితభావంతో పని చేసినందుకు తనపై అభిమానం చాటుతున్నారని అన్నారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పుట్టిన రోజు వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో శంషాబాద్ పట్టణంలో కేక్ కట్‌చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ బండిగోపాల్యాదవ్,నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శంషాబాద్ నుంచి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నివాసానికి చేరుకొని గజమాలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గణేశ్‌గుప్త, నీరటి రాజుముదిరాజ్, దిద్యాల శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, కౌన్సిలర్లు అమృతారెడ్డి, పారేపల్లిలావ ణ్య, జాంగీర్‌ఖాన్, అయిల్కుమార్, సునీతదయానంద్, మేకల వెంకటేశ్, భారతమ్మ, కోఆప్షన్ సభ్యులు, వైస్ ఎంపీపీ నీలం నాయక్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు,సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జన్మదినం సందర్భంగా సులేమాన్ నగర్ డివిజన్లో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు షేక్ నయీమొద్దీన్ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో షేక్ నయీం, ఎండీ హుస్సేన్ ,షేక్‌బాబా,మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.