ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. బుధవారం అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తి అయిన పలు అభివృద్ధి పనులను ఆయన ముఖ్య అథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ మినాజుద్దీన్తో కలిసి ప్రారంభించారు.
- 18 కాలనీల్లో రూ.4కోట్లతో పూర్తిచేసిన పనులకు ప్రారంభోత్సవాలు
- రూ.కోటి 50 లక్షలతో కొనసాగుతున్న పనుల పరిశీలన
- ఆనంద్‌నగర్‌లో ఓపెన్ జిమ్, పార్క్ సుందరీకరణకు ఆదేశాలు జారీ
- పెండింగ్ పనులను వేగవంతం చేయాలి
- మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల
సైదాబాద్, డిసెంబర్ 28: నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. బుధవారం అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తి అయిన పలు అభివృద్ధి పనులను ఆయన ముఖ్య అథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ మినాజుద్దీన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అక్బర్‌బాగ్ డివిజన్ పరిధిలోని 18 కాలనీల్లో పలు ప్రాంతాల్లో రూ.5.50 కోట్ల రూపాయలతో సీసీ, బీటీ రోడ్లు, తాగునీటి, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరణ పనులను చేపట్టామని, మరో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులు వివిధ స్థాయిల్లో కొనసాగుతున్నాయని, మిగతా పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించినట్లు ఆయన తెలిపారు.
అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరుగుతుందని, అదే విధం గా ఇప్పటికే గుర్తించిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల అదేశాలు ఇచ్చామని తెలిపారు. సమస్యల రహిత ఆదర్శవంతమైన డివిజన్లుగా తీర్చిదిద్దటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. ఆనందర్ నగర్ కాలనీ బస్తీ దవాఖానను ఎమ్మెల్యే బలాల సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికంగా కమ్యూనిటీ హాల్ అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పార్క్‌లో వాకింగ్ పాత్, ఓపెన్ జిమ్, ప్రహారీ ఎత్తును పెంచి పార్క్ సుందరీకరణకు తగు చర్యలు తీసుకోవాలని ఆనంద్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోహన్ రాజ్, స్థానిక మహిళలు ఎమ్మెల్యే విన్నవించుకోగా ఆనంద్ కాలనీవాసుల సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించేందుకు అవసరమై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఓపెన్ జిమ్, ప్రహారీ నిర్మాణం ఫెన్సింగ్, వాకింగ్ పాత్‌వేల నిర్మాణాల ను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. అదే విధంగా సపోటాబాగ్, మామిడి రామయ్యనగర్ బస్తీలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికంగా సామాజిక భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అక్బర్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ మినాజుద్దీన్, జీహెచ్ఎంసీ ఈఈ మహెబుబ్ మియా, ఏఈ వెంకన్న, ఆస్మాన్‌ఘడ్ జలమండలి డీజీఎం షీలారాణీ, వర్క్ ఇన్స్పెక్టర్ యాసిన్, నాగరాజ్‌గౌడ్, చెంచు రాము, పరాస్, సోను, జయ్‌కుమార్, కందికంటి సుమంత్ గౌడ్, ఆనంద్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం. మోహన్ రాజ్, అక్బర్‌బాగ్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింగ్, రాధ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

