డ్రగ్స్ కేసుల్లో శిక్ష పడేలా దర్యాప్తు జరపాలి
గంజాయి, డ్రగ్స్, నారోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శ్యాండిల్య అన్నారు. ఉద్యోగులుగా చట్టం పరిధిలోనే పనిచేస్తూ కేసుల దర్యాప్తులో పారదర్శకతతో పాటు నేరస్తులకు శిక్ష పడేలా సమగ్య దర్యాప్తు జరపాలని శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
- జీటీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గంజాయి, డ్రగ్స్, నారోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శ్యాండిల్య అన్నారు. ఉద్యోగులుగా చట్టం పరిధిలోనే పనిచేస్తూ కేసుల దర్యాప్తులో పారదర్శకతతో పాటు నేరస్తులకు శిక్ష పడేలా సమగ్య దర్యాప్తు జరపాలని శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
‘నారోటిక్ డ్రగ్స్ చట్టాలపై, కేసులు ఎలా రాయాలి?’ అనే అంశాలపై ఎక్సైజ్ ఆకాడమీలో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఎక్సైజ్ అధికారులకు సూచించారు. గంజాయి, డ్రగ్స్‌ను పట్టుకున్నప్పుడు ప్రాథమికంగా అవలంభించాల్సిన పద్ధతులను, పంచామా, జీడీ ఎంట్రీ, ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాల్సిన అనుమతులను, ఎఫ్ఆర్ఐలో పొందుపర్చాల్సిన సమాచారం, కేసు నమోదు, చార్జీషీట్, పంచుల ఎంపిక తదితర కీలక అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉదాహరణలతో వివరించారు.
నేరాలకు పాల్పడిన వారిలో శిక్షలు పడుతున్నాయనే భయం ఏర్పడితే నిషేధిత డ్రగ్స్, గంజాయి రవాణా, అమ్మకాలు, వినియోగం తగ్గుముఖం పడుతాయని డైరెక్టర్ సందీప్ శాండిల్య వివరించారు. ఈ సందర్భంగా టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో చట్టాలపై ముద్రించిన పుస్తకాలను శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 31 మంది ఎక్సైజ్ ఏఈఎస్‌లు, 84మంది ఎస్ఐలతో పాటు ఆకాడమీ డైరెక్టర్ సురేష్ రాధోడ్, జాయిండ్ డైరెక్టర్ శశిధర్‌రెడ్డి, ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

