హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ వేదికగా జరిగిన రాష్ట్ర టీటీ చాంపియన్షిప్లో మైరా జైన్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన టోర్నీ బాలికల అండర్-11 ఫైనల్లో మైరా జైన్ 7-11, 11-9, 15-17, 11-7, 14-12తో అవియాశ్పై గెలిచి టైటిల్ దక్కించుకుంది.
బాలికల అండర్-15 ఫైనల్లో అనియా ఆనంద్ 11-7, 11-13, 6-11, 11-7, 11-8తో శ్రీ సాన్విపై గెలిచింది. బాలుర అండర్-15 ఫైనల్లో శ్రీ అనిశ్, బాలికల అండర్-17లో సత్య అస్పతి, బాలుర విభాగంలో ఆరుశ్రెడ్డి విజేతలుగా నిలిచారు. పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన టీఎస్ఎస్టీఏ అధ్యక్షుడు కేకే మహేశ్వరి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.