చిక్కడపల్లి, డిసెంబర్ 18 : తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘ్ నూతన కమిటీని సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు. సంఘ్ అధ్యక్షుడిగా కెంబసారం కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కూరాకుల కృష్ణ, ఉపాధ్యక్షులుగా దేవసరి కృష్ణ, నర్సింహ, కార్యదర్శులుగా శ్రీనివాస్ రావు, అశోక్, కోశాధికారి విజయ్‌కుమార్, సత్యనారాయణ, సలహాదారుగా నిమ్మ చంద్రయ్య, మల్లేశ్, శంకర్, అంగడి బాల్‌రాజ్ తదితరులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ త్వరలోనే 30 జిల్లాలకు సంబంధించిన నాయకులకు రాష్ట్ర కమిటీల్లో పదవులు కేటాయిస్తామని తెలిపారు.