రవీంద్రభారతి, మే 14: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాలాది రత్న సుధీర్ రచించిన ‘అమ్మ చెక్కిన శిల్పం’ హిందీ అనువాద పుస్తకావిష్కరణ సభ మంగళవారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు.
సభా అధ్యక్షుడిగా రాంబాబు, ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి విచ్చేసి ‘అమ్మ చెక్కిన శిల్పం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ జాలాది రత్న సుధీర్ రచించిన అమ్మ చెక్కిన శిల్పం పుస్తకం చాలా అద్భుతంగా ఉందని, భవిష్కత్లో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రూప్ కుమార్ డబ్బీకార్, డా.సురభి శారద, గోవింద్ అక్షయ్, దీపక్ చిండాలియా తదితరులు పాల్గొన్నారు.