నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ) : ఈ నెల 12న తెలంగాణ జడ్జిల సంఘం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహా, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ లక్ష్మణ్ హాజరుకానున్నారని తెలిపారు. తెలంగాణ జడ్జిల మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సోసైటీ తరఫున మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు గృహ నిర్మాణాల గురించి ప్రత్యేక చర్చ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షులు కె.ప్రభాకర్‌రావు, బి.పాపిరెడ్డి (హౌజింగ్ సోసైటీ అధ్యక్షులు)తో పాటు సభ్యులు పాల్గొంటారని తెలిపారు.