బాలానగర్, నవంబర్ 19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాకే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు ఫిరోజ్‌గూడలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ రవీందర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఫిరోజ్‌గూడ, గీతానగర్, నవజీవన్‌నగర్, వినాయక్‌నగర్, గణేశ్‌నగర్, సాయినగర్, చెరబండరాజుకాలనీ, రాజుకాలనీ, బాలానగర్ కనకదుర్గ ఆలయం మీదుగా కోమటిబస్తీ, శ్రీశ్రీనగర్, ఇందిరానగర్, రాజీవ్గాంధీనగర్ల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, స్వరాష్ట్రంలో 60 ఏండ్లలో కాని అభివృద్ధి కేవలం తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారంటే.. నెరవేర్చే వరకు శ్రమిస్తారన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే బాలానగర్ ట్రాఫిక్ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. సమస్య పరిష్కారానికి రూ. 387 కోట్ల నిధులు కేటాయింప జేసి ైఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు.
అనంతరం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో మైనార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కృష్ణారావు డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య, మందడి సుధాకర్‌రెడ్డి, పంజా రాంచందర్ ముదిరాజ్, ఎండీ ఖాజా, శంకర్‌గౌడ్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎండీ గౌస్, కూకట్పల్లి నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్, ఓల్డ్‌బోయిన్‌పల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇర్ఫాన్ పాల్గన్నారు.