Drugs | హైదరాబాద్ : డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహించే వారిపై, ప్రకటనలతో తప్పుదోవ పట్టించేవారిపై ఎవరైనా ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969 ఏర్పాటు చేసింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నవారిపై, డ్రగ్స్ సరఫరాను, క్రయవిక్రయాలను గుర్తించిన సాధారణ పౌరులెవరైనా ఆ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు.
Dca