సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఘట్కేసర్ మండల పరిధిలోని వెంకటాపూర్‌లో ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు తెలంగాణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, యూనివర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కవి, గేయ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్, యూనివర్సిటీ సీఈవో సూర్యదేవర నీలిమ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. గౌరమ్మను కొలుస్తూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ఎస్ రామచంద్రం, రిజిస్ట్రార్ బాలాజీ, కన్వీనర్ శిరీష, కో కన్వీనర్ సరిత, అనురాగ్ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీస్ అకాడమీలో..
తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీదేవి, డిప్యూటీ డైరెక్టర్ జానకి షర్మిల, పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ , జాయింట్ డైరెక్టర్ నవీన్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అదితరులు పాల్గొన్నారు.
బీఎస్ఎన్ఎల్ భవన్లో…
ఆదర్శ్‌నగర్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ బిజినెస్ ఏరియా, టెలికాం డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎన్.సుజాత పాల్గొని రంగు రంగు పూలతో పేర్చిన బతుకమ్మలను పూజించారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్, పీజీఎం ఏరియా(1,2) చంద్రశేఖర్, ఏజీఎం వెల్ఫేర్ జయశ్రీ, ఎస్డీఈలు సుధారాణి , పవన్ దుగ్యాల, డీజీఎంలు,ఏజీఎంలు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన పూల పండుగ సందర్భంగా వీసీ ఆచార్య టి. కిషన్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
జలమండలిలో…
జలమండలిలో బతుకమ్మ పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబురాల్లో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. బతుకమ్మను పేర్చి ఆడిపాడుతూ ఉల్లాసంగా గడిపారు.
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో..
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ ఆధ్వర్యంలో నాంపల్లి గృహకల్పలోని జిల్లా శాఖ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, కోశాధికారి జే.బాలరాజ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు సుజాత, గీతా సింగ్, ఖాలేద్ అహ్మద్, వైదిక్ శస్త్ర, శ్రీధర్ నాయుడు, మహ్మద్ వహీద్, వెంకట్‌రెడ్డి, మాజీ కార్యదర్శులు పాల్గొన్నారు. -సుల్తాన్‌బజార్,అక్టోబర్ 20