సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఇందులో భాగంగానే మంగళవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పసుమాముల గ్రామంలోని ఆల్ రిచ్ డెయిరీ ప్రై.లి (శ్వేత డెయిరీ)పై స్టేట్ లెవల్ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. డెయిరీ ప్రాసెసింగ్ యూనిట్ అపరిశుభ్రంగా ఉన్నట్లు, కోల్డ్ స్టోరేజ్ గదులలో తుప్పుపట్టిన గోడలు, యంత్రాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే హానికరమైన రసాయనాలను సీజ్ చేసి, 280 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లైసెన్స్‌ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.