రామంతాపూర్/చిక్కడపల్లి/శంషాబాద్ రూరల్: స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ఎస్ ఆర్ ఓ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు బంద్ పాటించారు.
ఇందులోభాగంగా ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం, శంషాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలిపారు. టీడీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్, ఉపాధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఊట్కూరి రామకృష్ణ గౌడ్ పలు ప్రాంతాల్లో దస్తావేజు లేఖరులకు సంఘీభావం తెలిపారు.