కవాడిగూడ, ఫిబ్రవరి 11: పీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో నక్సలైట్లు ప్రగతి భవన్‌ను పేల్చాలని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నాగరిక సమాజం అసహ్యించుకుంటుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మానసిక స్థితి, స్థిరత్వాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు. శనివారం కవాడిగూడలోని అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డికి భూత, ప్రేత పూజలు చేయించి పార్టీని కాపాడుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు భవిష్యత్తులో ఉంటాయని హితవు పలికారు.