మెహిదీపట్నం మే 1 : రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని గోల్కొండ మండల తహసిల్దార్ డి. ఆహల్య సూచించారు. గురువారం గోల్కొండ తహసిల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గోల్కొండ మండల పరిధిలో రాజీవ్ యువ వికాసం పథకం కింద మొత్తం 3,507 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు.
ఇందులో ఎస్సీ కార్పొరేషన్లో 317, ఎస్టీ కార్పొరేషన్‌కు 34, బీసీ కార్పొరేషన్‌కు 385, ఈబీసీ కార్పొరేషన్‌కు 35, మైనారిటీ కార్పొరేషన్‌కు 2,727, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్‌కు 9 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అన్ని పత్రాలు జత చేసి తహసిల్దార్ కార్యాలయంలో వెంటనే అందజేయాలని సూచించారు.