గోల్నాక, జూలై 13: అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది అదృశ్యమైన ఓ యువతి కేసును సీఐడీకి అప్పగించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. ఆకాశ్నగర్కు చెందిన మహ్మద్ హుస్సేన్ కూతురు మెహక్ ఫాతిమా (18) 2021 జూలై 30న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడాది గడుస్తున్నా.. ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాగా, యువతిని అక్రమ రవాణా చేశారా అనే అనుమానాలు తలెత్తడంతో పూర్తి స్థాయి దర్యాప్తు కోసం బుధవారం కేసును సీఐడీ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగానికి బదిలీ చేశారు.