ఐఐటీ హైదరాబాద్‌లో ఎలాన్ అండ్ ఎన్ విజన్ పేరుతో ఆన్లైన్లో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. యేటా నిర్వహించే టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ ఐఐటీ హైదరాబాద్‌కు ఎంతో ప్రత్యేకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు కలిసి నిర్వహించే ఈ కాలేజ్ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్లో 10వేల మందికి పైగా విద్యార్థులు, దేశ వ్యాప్తంగా ఉన్న 100కు పైగా కళాశాలలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈవెంట్లో టాక్ షోలు, స్టాండప్స్, మ్యూజిక్ నైట్స్, ఈడీఎంలు, బ్యాండ్ ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఈవెంట్‌ను వర్చువల్‌గా నిర్వహిస్తున్నామని తెలిపారు. మెంటల్ హెల్త్ అవేర్నెస్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇందులో భాగంగా టాక్‌షోను సంఘర్ష్గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, బ్రేక్‌ఫ్రీ, క్యాంపస్ ఐడల్, ఆర్ట్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ కాంపిటీషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు.