Minister Damodara | కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో టెక్నికల్ కమిటీని నియమించాలి : మంత్రి ఆదేశం
Minister Damodara | రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు టెక్నికల్ కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు టెక్నికల్ కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarasimha) సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్, హైదరాబాద్ లోని అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల నిర్మాణ పనుల పురోగతి తో పాటు ఎర్రమంజిల్ లోని నిమ్స్(NIMS) హాస్పిటల్లో 2వేల బెడ్స్ సామర్ధ్యం తో నిర్మిస్తున్న విస్తరణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు రావాలని సూచించారు.
వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి మెరుగైన వైద్య సేవల(Better medical Services) కోసం వచ్చే రోగులకు అంధించే చికిత్సలపై టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. టెక్నికల్ కమిటీ సూచించిన విధంగా ఆయా ఆస్పత్రులలో స్పెషాలిటీ సేవలను, చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోoగ్తు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు ఆర్ అండ్ బీ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు .
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

