సిటీబ్యూరో, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): భోజన ప్రియత్వమంటే అతిహారం కాదనీ, మితహారాన్నే సంపూర్ణంగా షడ్రశోపితంగా, మనస్ఫూర్తిగా స్వీకరించడమని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. టియోనాట్ నియోకేర్ సంస్థ శనివారం నూతన పోషకాహార ఉత్పత్తుల శ్రేణి ‘నియో ఆహార్’ను ఘనంగా ప్రారంభించిన సందర్భంగాముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఉత్పత్తులని ప్రారంభించి మాట్లాడారు.
రుచికి పోషక విలువల్ని జతచేయడం, ఈ తరానికి తగినట్టుగా 5 నిమిషాల్లోనే సిద్ధం చేయగలగడం అద్భుతమన్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీ వి.ఎన్. ఆదిత్య, మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు శ్రీ పి.విజయ బాబు, టియోనాట్ నియోకేర్ సంస్థ ఎండీ సత్య ప్రసాద్, ప్రముఖులు పాల్గొన్నారు.