హైదరాబాద్ : నగరంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అమీర్‌పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్‌లోని(Aditya Enclave building) కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమీర్‌పేట, ఎస్ఆర్నగర్ నిత్యం బిజీగా ఉండే ప్రాంతాలన్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకుండా తనిఖీలు చేపట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగనప్పుడు అడావుడి చేయకుండా పక్కా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన సిగాచి కార్మికులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కాగా, అమీర్‌పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్‌లోని కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను బయటకు తరలిస్తున్నారు. నిచ్చెన సాయంతో 60 మంది విద్యార్థులను పోలీసులు కిందకు దించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్య్కూట్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.