హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని అంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ఆనవాళ్లు అంటే అద్భుతమైన సెక్రటరియేట్, పక్కనే అమరవీరుల స్థూపం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి టెంపుల్ వాటిని కూలుస్తారా? అని ప్రశ్నించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా అంటున్న ముఖ్యమంత్రి దేశంలో లేడన్నారు. ఎంతో గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానం విలువను దిగజారుస్తున్నాడని మండిపడ్డారు.