Assembly | కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభను అభాసుపాలు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి. మొదటి రోజు గేటు బయట డ్రామా నడిపించారు. రెండోరోజు కేసీఆర్ డ్రామా నడిపించారని విమర్శించారు. మార్కూక్ మండలంలో కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యే సభలో ఉన్నాడు. కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చెయ్యలేదని ప్రశ్నించారు. తిరుపతిలో ఉన్న మల్లారెడ్డిని సస్పెండ్ చేశారు.
సభలో లేని కేటీఆర్ ను సస్పెండ్ చేశారు. సభలోని గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేశారు. 22- A అంశం జీవో 97 చర్చకు వస్తాయిని ప్రభుత్వం భయపడుతుంది. అందేకు ఇలా చేస్తుదన్నారు. దళిత స్పీకర్ అంటూ స్పీకర్ ను కాంగ్రెస్ అవమానిస్తుంది. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్ కు గౌరవం ఉంది. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నాడనే బీఆర్ఎస్ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. AI ఫోటోలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫొటోలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు.
కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేలను సభలో పెట్టుకున్నారు. భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే..పసుపు నీళ్లతో కడుగుతున్నారు. చర్చలు జరగాలనే ఉద్దేశ్యం సభలో లేదన్నారు. ఏం కొంపలు ఆరీపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హుటాహుటిన సస్పెండ్ చేశారని ప్రశించారు. ఎర్రవల్లి ఫాం హౌస్ మేము వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ శ్రేణుల పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయన్నారు.