Stray Dogs | సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ, హెల్త్ తదితర శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి మంత్రి తలసాని మాట్లాడారు.
నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఇటీవల అంబర్ పేటలో నాలుగేండ్ల బాలుడు కుక్కల దాడిలో గాయపడి మృతి చెందడం అత్యంత బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించాలని ఆదేశించారు. బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అధికంగా కుక్కలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.
కోతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మంత్రి తలసాని వివరించారు. కోతులను పట్టుకోవడంలో ప్రత్యేక అనుభవం ఉన్న వారి ద్వారా నగరంలోని కోతులను పట్టుకొని అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేరొన్నారు. చనిపోయిన జంతువులను సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్ హెల్త్ శృతి ఓజా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
రోడ్లపై కుక్కలకు ఇష్టమొచ్చినట్లుగా ఆహారం వేయడం వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మంత్రి తలసాని పేర్కొన్నారు. మాంసపు షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న కారణంగా మటన్, చికెన్ షాపుల వద్ద కుక్కల సంఖ్య ఎకువగా పెరుగుతుండటానికి కారణం అవుతున్నాయని పేరొన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీంలతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. కోతులు, కుక్కల సమస్య పరిషారానికి జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వాటి ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని వివరించారు.
కుక్క కాటు బాధితులకు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ‘రిగ్’ విభాగం ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర దవాఖానల్లో ఇచ్చే ఏఆర్‌వి(యాంటి రేబిస్ వ్యాక్సిన్)టీకాలు కుక్క కాటుతో ఏర్పడిన గాయం, కరిచిన కుక్క ఆరోగ్యపరిస్థితి ఆధారంగా పలు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అదే రిగ్ టీకా అయితే ఎంతటి తీవ్ర గాయమైనా, ఎలాంటి కుక్క కరిచినా కేవలం ఒకే ఒక్క సింగిల్ డోస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రిగ్ టీకా నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో ఇస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ఆర్ఎంవో డాక్టర్ జయలక్ష్మి వెల్లడించారు. ఈ సెంటర్లో 365 రోజులు 24గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
☞ సరిల్ వారీగా కుక్కకు యాంటీ బర్త్ కంట్రోల్, స్టెరిలైజేషన్, వీధి కుక్కలను పట్టుకోవడానికి టీమ్స్, వాహనాలు, సిబ్బందిని పెంచడం.
☞ వీధి కుక్కలు ఎకువగా సంచరించే ప్రదేశాలను గుర్తించడం.
☞ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, స్లమ్ లెవెల్ ఫెడరేషన్, టౌన్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా కుక్క కాటు ప్రమాదాల రక్షణకు వేగవంతమైన చర్య లు. అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని అందించడంపై నెల రోజుల అవగాహన కార్యక్రమం.
☞ వీధి కుక్కలపై ఫిర్యాదుకు జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-21111111, మై జీహెచ్ఎంసీ అప్లికేషన్ ద్వారా, సిటిజన్ బడ్డీ ద్వారా కుక్కలపై రిపోర్ట్ చేసేందుకు ప్రచారం కల్పించాలి.
☞ వీధుల్లో మాంసాహార వ్యర్థాలను పార వేయకుండా, నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే వ్యర్థాలను డంప్ చేసేందుకు ఆమోదం.
☞ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, శానిటేషన్ స్టాఫ్, మెప్మా స్టాఫ్ ద్వారా వీధి కుక్కల ప్రమాదాలపై అప్రమత్తం చేసేందుకు ప్రచార కరపత్రాలను ముద్రించి ప్రభుత్వ, ప్రైవేట్ సూల్లో పంచాలి.
☞ జీహెచ్ఎంసీ ద్వారా అన్ని పాఠశాలల్లో కరపత్రాలు పంచి విద్యార్థులకు వీధికుక్కలపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు.
☞ శానిటేషన్ వరర్స్, ఔట్ సోర్సింగ్ స్టాఫ్, వీధి కుక్కలపై తీసుకోవలసిన చర్యలపై శిక్షణ పొంది ఉండాలి. లోకల్ రెసిడెంట్స్‌కు , రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు శిక్షణ.
☞ వీధి కుక్కల దత్తత ద్వారా పెట్ ఓనర్ షిప్‌ను ప్రోత్సహించేందుకు అవగాహన.
☞ కుక్క కాటు ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రుల వివరాలను ఐపీఎం(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)నారాయణగూడ, ఫీవర్ హాస్పిటల్ నల్లకుంటల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆయా ప్రదేశాల్లోని కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాలి.
☞ వీధి కుక్కలతో చేయాల్సినవి, చేయకూడనివి అనే అంశాలతో కూడిన బిల్ బోర్డ్, హోర్డింగ్స్‌ను ముఖ్య కూడలిలో ఏర్పాటు చేయడం, యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యతను తెలియజేయాలి.
☞ వేసవి కాలంలో వీధి కుక్కలకు అధిక సంఖ్యలో తాగునీటి వసతిని అనువైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి.