అంబర్పేట, నవంబర్ 10 : ఈ నెల 15వ తేదీ వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఇన్స్పెక్టర్ టి.కిరణ్కుమార్ అన్నారు. పంతాలు, పట్టింపులకు పోకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవసరం కొద్దో ఆవేశం కొద్దో పెట్టుకున్న కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవచ్చని తెలిపారు. ఈ అదాలత్లో పాత కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి పంపకాలు, భార్యాభర్తల పంచాయితీలు, బ్యాంకు రికవరీలు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, కొట్లాటలు, రోడ్డు ప్రమాదాల కేసులు, పేకాట, ఎక్సైజ్ కేసులు, దొంగతనం కేసులు కూడా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చన్నారు.
పంతాలకు పోకుండా మానసిక ప్రశాంతత కోసం రాజీ మార్గం ఉత్తమమైనదని చెప్పారు. సమస్యలను సమస్యలుగా కాకుండా పరిష్కారాల దిశగా ఆలోచన చేయాలని సూచించారు. ఈ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం కోసం ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఇన్స్పెక్టర్ లేదా సంబంధిత సెక్టార్ ఎస్సైలు, పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. స్టేషన్లో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.