MLA Sudheer Reddy | హయత్ నగర్, ఏప్రిల్ 3 : మన్సురాబాద్ డివిజన్లోని స్వాతి రెసిడెన్సి దగ్గర నిలిచిపోయిన ట్రంక్ లైన్ అవుట్ లెట్ సమస్యను పరిష్కరిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ ఫేస్ – 2, లక్ష్మి భవాని కాలనీ, టీ నగర్, కెవిఎన్ రెడ్డి కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, అంజలి రెసిడెన్సి, స్వాతి రెసిడెన్సి, లక్ష్మీ ప్రసన్న కాలనీ, ఆదర్శనగర్, పవన్ గిరి కాలనీ, ఎల్లారెడ్డి కాలనీ పేస్- 2 కాలనీల ప్రజలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ట్రంకులైన్ పనుల్లో భాగంగా పక్కనే ఉన్న ప్రైవేటు స్థలం నుండి డ్రైనేజీ లైన్ వెళుతున్న నేపథ్యంలో కొందరు నాయకులు, అట్టి స్థల యజమాని బెదిరించి ట్రంక్ లైన్ వెళ్లకుండా నిరాకరించారని తెలిపారు. ట్రంక్ లైన్ అవుట్ లైట్ పనుల్లో ఆయా కాలనీవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోసారి ప్రైవేట్ స్థలం యజమానితో మాట్లాడి ట్రంక్ లైన్ అవుట్ లెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. రాజకీయాలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్, పలు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.