హిమాయత్ నగర్,జూన్ 26: యునైటెడ్ స్టేట్స్, భారత దేశంతటా 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గాను ‘మిసెస్ ఆసి యా వరల్డ్ విన్నర్ 2025 కిరీటాన్ని పొందినట్లు మనస్వ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సూర్య రేవతి మెట్టుకూరు గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 22న దుబాయ్లో జరిగిన ఒక గ్రాం డ్ అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ గౌర వం దక్కిందని అన్నారు. ఐటీ, ఫైనాన్స్, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ రంగాలలో సీఈఓగా పనిచేసిన తాను తెలంగాణ రాష్ట్రంలోని ఐదు గ్రామాలను దత్తత తీ సుకుని విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సంక్షేమం,యువత ఉపాధిపై దృష్టి సారిం చి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.